లాక్డౌన్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన పేదలకు 5 వేల ఆర్థికసాయం అందించటంతోపాటు అన్నక్యాంటీన్లు పునరుద్ధరించాలని కోరుతూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంలో నిరసనదీక్ష చేపట్టారు. ఆయనకు తెదేపా జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, పలువురు తెదేపా నేతలు సంఘీభావం ప్రకటించారు. విపత్కర పరిస్థితుల్లో వైకాపా ప్రభుత్వం సేవా కార్యక్రమాలపై దృష్టి సారించకుండా రాజకీయ విమర్శలు చేయటం సరికాదని నేతలు హితవు పలికారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు, పేదవర్గాలను ఆదుకునేందుకు పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.
ఇదీచదవండి