రాష్ట్రంలో మహా పంచాయత్ సభలతో రైతులకు కేంద్రంలో భాజపా అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను వివరిస్తామని రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు. విజయవాడలో రైతు సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 19న విజయవాడ, ఒంగోలులో నిర్వహించే మహాపంచాయత్ సభలకు జాతీయ స్థాయి రైతు సంఘాల నాయకులు రాకేష్ టికాయత్ సహా పలువురు పాల్గొంటారన్నారు.
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మకూడదనే ప్రధాన డిమాండ్‌తో కార్మికులు, నిర్వాసితులు ఉద్యమం చేస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోగా నూరు శాతం అమ్మేస్తామని చెప్పడం దారుణమన్నారు. ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులకు మద్దతుగా జాతీయ రైతు సంఘాల నాయకులతో విశాఖలో 18వ తేదీన నిరసన ర్యాలీ నిర్వహిస్తామన్నారు.పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు రైతులకు భారంగా మారాయన్నారు. రైతుల ఆదాయం పెంచుతామని చెప్పిన ప్రధాని.. బడ్జెట్ రాయితీ తగ్గించి.. ఆ ధరను ఎరువులపై పెంచి భర్తీ చేసుకున్నారని కౌలు రైతు సంఘం నాయకులు కేశవరావు అన్నారు. వాస్తవాలను రైతులకు మహా పంచాయత్ సభల ద్వారా వివరిస్తామన్నారు.
ఇదీ చదవండి: