ETV Bharat / city

సామాన్యుడి కోసం కారు దిగొచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్​

హైదరాబాద్​లోని టోలిచౌకి.. మధ్యాహ్నం తెలంగాణ సీఎం కేసీఆర్​ కాన్వాయ్​ వెళ్తోంది. అలా వెళ్తుండగా సీఎం కేసీఆర్​కు ఓ వృద్ధుడు.. చేతిలో దరఖాస్తుతో దీనంగా కనిపించాడు. అతన్ని చూసిన ముఖ్యమంత్రి వెంటనే కారు దిగి ఆ వృద్ధుని సమస్యలు తెలుసుకున్నారు. వెంటనే స్పందించి సహాయం అందించాలని కలెక్టర్​కు ఆదేశాలు జారీ చేశారు.

సామాన్యుడి కోసం కారు దిగొచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్​
సామాన్యుడి కోసం కారు దిగొచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్​
author img

By

Published : Feb 27, 2020, 9:03 PM IST

సామాన్యుడి కోసం కారు దిగొచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్​

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ మరోసారి తన ఔదార్యం చాటారు. దివ్యాంగుడైన ఓ వృద్ధుడి మొరను ఆలకించిన సీఎం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించారు. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్​లోని టోలీచౌకిలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్లిన ముఖ్యమంత్రికి.. మార్గమధ్యంలో దివ్యాంగుడైన వృద్ధుడు చేతిలో దరఖాస్తుతో కనిపించారు. అతన్ని చూసిన కేసీఆర్​ కారు దిగొచ్చి అతని సమస్యను అడిగి తెలుసుకున్నారు. గతంలో డ్రైవర్​గా పనిచేసిన తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, నాలుగేళ్ల క్రితం భవనంపై నుంచి పడడం వల్ల కాలు విరిగిందని వృద్ధుడు మహ్మద్ సలీం వివరించారు. తన కుమారుని ఆరోగ్యం బాగా లేదని, ఉండేందుకు కూడా ఇళ్లు లేదన్న సలీం... తగిన సాయం చేయాలని కేసీఆర్​ను వేడుకున్నారు.

కేసీఆర్​ సహాయం

సలీం పరిస్థితిపై స్పందించిన కేసీఆర్... సమస్యలను పరిష్కరించి దివ్యాంగుల ఫించను, రెండు పడకల గదుల ఇళ్లు మంజూరు చేయాలని హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతిని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సలీం ఉంటోన్న ప్రాంతానికి వెళ్లిన కలెక్టర్.. విచారణ జరిపారు. సలీం దివ్యాంగుడని నిర్ధరించే సదరం ధ్రువపత్రం ఉండడం వల్ల అక్కడే ఫించన్​తో పాటు జియాగూడలో రెండు పడకల గదుల ఇంటిని మంజూరు చేశారు. ప్రభుత్వ ఖర్చులతో సలీంకు వైద్య పరీక్షలు చేయిస్తామని హామీ ఇచ్చారు. అనారోగ్యంతో బాధ పడుతోన్న సలీం కుమారునికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తామని పాలనాధికారి తెలిపారు.

ఇదీ చదవండి:

ఆ సీత అడవులకెళితే.. ఈ బేబీ చీకటిలో మగ్గింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.