వచ్చే ఏడాది జనవరి నాటికి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని... భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. విజయవాడలోని ఓ హోటల్లో పార్టీ సంస్థాగత ఎన్నికల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇప్పటికే సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తైందని... త్వరలోనే మండల కమిటీలు, జిల్లా కమిటీలు పూర్తి చేసి జిల్లా అధ్యక్షులను ప్రకటిస్తామన్నారు. డిసెంబర్ చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా చేసుకొని... పార్టీ నిర్మాణం కోసం చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి