తెలుగుదేశం పార్టీ జారీ చేసిన విప్‌ను అనుసరించి రాజ్యసభ ఎన్నికల్లో వర్ల రామయ్యకు ఓటు వేసి నిబద్దతను చాటుకున్న శాసన సభ్యులందరికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అభినందనలు తెలిపారు. అధికార పార్టీ ప్రలోభాలు, ఒత్తిడిని లెక్క చేయక సామాజిక న్యాయానికి మద్దతుగా వర్ల రామయ్యకి ఓటు వేయడం ద్వారా నైతిక విజయం చేకూర్చామని కొనియడారు. ఎక్కువమంది వైకాపా శాసన సభ్యులుగా ఎస్సీ, ఎస్టీ ఉన్నా రాజ్యసభలో దళితులకు మొండిచేయి చూపారని మండిపడ్డారు. బీసీ మంత్రులిద్దర్ని డీప్రమోషన్ చేసి సామాజిక న్యాయాన్ని మంటగలిపారని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ విప్‌ను ధిక్కరించిన ముగ్గురు శాసన సభ్యులపై ఫిరాయింపుల చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు తగు కార్యాచరణ చేపడతామని స్పష్టం చేశారు.
'విప్ ధిక్కరించిన ముగ్గురు ఎమ్మెల్యేలపై చట్ట ప్రకారం చర్యలు'
రాజ్యసభ ఎన్నికల్లో తెదేపా విప్‌ను ధిక్కరించిన ముగ్గురు శాసన సభ్యులపై ఫిరాయింపుల చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు తగు కార్యాచరణ చేపడతామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు స్పష్టం చేశారు.