ETV Bharat / city

పాలమూరు-రంగారెడ్డిపై ఎన్జీటీకి సంయుక్త కమిటీ మధ్యంతర నివేదిక - కృష్ణా నది

ఎన్జీటీ
ఎన్జీటీ
author img

By

Published : Sep 24, 2021, 6:25 PM IST

Updated : Sep 24, 2021, 8:31 PM IST

18:21 September 24

VJA_NGT_ Joint committe report on Ranga Reddy lift project_Breaking

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)కి సంయుక్త కమిటీ నివేదిక సమర్పించింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను అక్రమంగా నిర్మిస్తున్నారని ఏపీ రైతులు గతంలో ఎన్జీటీని ఆశ్రయించారు. నీటి కేటీయింపులు లేకుండానే ప్రాజెక్టు నిర్మిస్తున్నారని ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. పాలమూరు-రంగారెడ్డి తాగునీటి కోసమే అని ఆ సమయంలో తెలంగాణ వాదనలు వినిపించింది. ఈ అంశంపై నిజనిర్ధారణ కోసం గతంలో ఎన్జీటీ సంయుక్త కమిటీని నియమించింది. ఎన్జీటీ ఆదేశాల మేరకు ఇటీవలే సంయుక్త కమిటీ ప్రాజెక్టును సందర్శించింది. ఈ మేరకు ఎన్జీటీకి మధ్యంతర నివేదికను సమర్పించింది. ప్రాజెక్టులో సాగునీటి పనులూ జరుగుతున్నాయని కమిటీ నివేదికలో పేర్కొంది. తుది నివేదిక ఇచ్చేందుకు 8 వారాలు గడువు కావాలని ఎన్జీటీని కోరింది.

ఇదీ చదవండి: Water issue: ఆ పనులే రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీస్తోంది: షెకావత్‌

Last Updated : Sep 24, 2021, 8:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.