జేఈఈ మెయిన్స్ పరీక్ష మధ్యస్థంగా ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. మూడో విడత జేఈఈ మెయిన్స్‌ను మంగళవారం రెండు విడతలుగా నిర్వహించారు. కరోనా రెండో దశలో కేసులు తగ్గిన తర్వాత విద్యార్థులు మొదటిసారిగా ఈ పోటీ పరీక్షను రాశారు. ఉదయం సెషన్‌లోని ప్రశ్నపత్రంలో భౌతికశాస్త్రం నుంచి ఉష్ణగతి, విద్యుత్తుగతి శాస్త్రాల నుంచి ప్రశ్నలు కొంచెం ఎక్కువ ఇచ్చారు.
యూనిట్స్, డైమెన్షన్ నుంచి వచ్చిన ప్రశ్నలు కాస్త కఠినంగానే ఉన్నట్లు శారద, శ్రీచైతన్య కళాశాలలకు చెందిన నిపుణులు విఘ్నేశ్వరరావు, శ్రీనివాసరావు వెల్లడించారు. రసాయనశాస్త్రంలో కాంప్లెక్స్, కాంపౌండ్స్, హైడ్రోజన్, దాని కాంపోనెడ్స్ నుంచి వచ్చిన రెండు ప్రశ్నలు సంక్లిష్టంగా ఉన్నాయి. మధ్యాహ్నం సెషన్‌లో గణితంలో రెండు, మూడు ప్రశ్నలు సమయం తినేవి ఇచ్చారు. భౌతికశాస్త్రంలోని వేవ్స్ అధ్యయనం, గెలాక్సీ నుంచి కొత్తగా ప్రశ్నలు ఇచ్చారు. మొత్తం 300మార్కులకు ప్రతిభ కలిగిన విద్యార్థులు 285 నుంచి 290 వరకు మార్కులు సాధించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: