కొవిషీల్డ్ మొదటి, రెండవ డోసుల మధ్య సమయాన్ని 42 రోజుల నుంచి 84 రోజులకు పెంచేందుకు కోవిన్ యాప్లో మార్పులు చేసినట్లు కృష్ణాజిల్లా జేసీ శివశంకర్ తెలిపారు. మే 14 అర్ధరాత్రి నుంచి మార్పులు అమల్లోకి వస్తాయన్నారు. ఈ మార్పులను మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు గమనించాలని విజ్ఞప్తి చేశారు.
ఇకపై 84 రోజులు తక్కువ వ్యవధి ఉన్న వారికి ఆన్ లైన్, ఆన్ సైట్లో వ్యాక్సినేషన్ సాధ్యం కాదన్నారు. అయితే ముందస్తుగా ఆన్ లైన్లో రిజిస్టర్ చేసుకున్న వారి స్లాట్లు రద్దు కావని తెలిపారు. ప్రైవేట్ కొవిడ్ వాక్సినేషన్ సెంటర్లు, క్షేత్రస్థాయి సిబ్బందికి.. ఈ విషయంపై అవగాహన కల్పించాలని సూచించారు.
ఇవీ చదవండి:
కొవిడ్ కమాండ్ సెంటర్లో సీఎం ఆకస్మిక తనిఖీ
'జూన్ నాటికి కొత్త ఆక్సిజన్ ప్లాంట్లు అందుబాటులోకి వస్తాయ్..'