కరోనా వ్యాప్తి నివారణకు జనతా కర్ఫ్యూ పాటించాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు విజయవాడలో ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూలో పాల్గొంటున్నారు. ఉదయం 7 గంటల నుంచి ఇళ్లకే పరిమితమయ్యారు. కర్ఫ్యూతో విజయవాడలోని రద్దీగా ఉండే బెంజ్ సర్కిల్ రోడ్డు వెలవెలబోతుంది. చెన్నై - విజయవాడ జాతీయ రహదారిపై అత్యవసర వాహనాలు మినహా, ఇతర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసరం మినహా మిగిలిన సేవలు అన్నీ బందయ్యాయి. విజయవాడలో కర్ఫ్యూ పరిస్థితిపై మా ప్రతినిధి అందిస్తోన్న వివరాలు..!
ఇదీ చదవండి: