విజయవాడ దుర్గగుడి అవినీతికి కేరాఫ్‌గా మారిపోయిందని.. జనసేన అధికార ప్రతినిధి మహేశ్ ఆరోపించారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి కనుసైగల్లో భారీ అవినీతికి తెరలేపారని వ్యాఖ్యానించారు. అమ్మవారి ఆదాయానికి ఇష్టానుసారం గండి కొడుతున్నారన్నారు. అభివృద్ధి కార్యక్రమాలపై ఆడిట్ జరగటం లేదని తెలిపారు. దేవస్థానం నిధులను ఇష్టానుసారం విడుదల చేస్తున్నారని మహేశ్ పేర్కొన్నారు. సీ వేజ్ ప్లాంటు పేరుతో మూడు కొట్లు అవినీతి జరిగినట్లు అనుమానాలు ఉన్నాయన్న మహేశ్... ఈఓ సూరేష్ బాబు, మంత్రి వెల్లపల్లి బినామిగా కొనసాగుతున్నారనే విమర్శలు వస్తున్నాయని వెల్లడించారు.
ఇదీ చదవండి: