వైకాపా ఎమ్మెల్యే జోగిరమేష్ పవన్‌కల్యాణ్‌ను దూషించటంపై జనసేన పార్టీ పీసీసీ సభ్యులు శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ జనసేన పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. వైకాపా ఎమ్మెల్యేలు మతి చెలించి మాట్లాడుతున్నారని విమర్శించారు. తెదేపాపై కక్షతోనే సీఎం జగన్ రాజధానిని మారుస్తున్నారని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో 8 నెలలుగా అభివృద్ధి లేదని ఆక్షేపించారు. నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా వైకాపా నేతలు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇదీ చూడండి: