ETV Bharat / city

"వేణుగోపాలకృష్ణ బీసీ శాఖ మంత్రా..? జగన్ భజన శాఖ మంత్రా..?" - ఏపీ లేటెస్ట్ అప్​డేట్స్

Janasena leader Potina Mahesh: 'చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ బీసీ శాఖ మంత్రా..? లేక జగన్ భజన శాఖ మంత్రా..?' అని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ ప్రశ్నించారు. పాత్రికేయులకు సీఎంను ఆరాధించాల్సిన అవసరం లేదని... వారు సమాజ హితం కోసం పని చేస్తారని తెలిపారు. కొన్ని నెలల్లో కొద్ది నెలలు ఆగితే.. వైకాపా అనే దోపిడీ ముఠా మొత్తాన్ని సీబీఐ దత్తత తీసుకుంటుందన్నారు. అప్పుడు వారి సీబీఐ దత్త పుత్రుడికి చంచల్​గూడ జైల్లోనో.. చర్లపల్లి జైలులోనో ఆరాధన కార్యక్రమాలు, భజనలు పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు.

Janasena leader potina Mahesh
జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్
author img

By

Published : Apr 13, 2022, 1:18 PM IST

Janasena leader Potina Mahesh : 'చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ బీసీ శాఖ మంత్రా..? లేక జగన్ భజన శాఖ మంత్రా..?' సమాధానం చెప్పాలని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ డిమాండ్ చేశారు. 'మీరు ఆరాధిస్తున్నారు కాబట్టి ఒక ఆరాధన సంఘం పెట్టుకోండి.. చిడతాలు కొట్టుకోండి'అని హితవు పలికారు. విలేకరులు ఆరా తీస్తారు.. సమాజ హితం కోసం పని చేస్తారు.. వారికి ఆరాధించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోవాల్సిన, అమ్ముకోవాల్సిన అవసరం పాత్రికేయులకు లేదన్నారు. ఆరాధించాలని పాత్రికేయులపై చులకన భావంతో మాట్లాడినా చెల్లుబోయిన గోపాలకృష్ణ తక్షణమే పాత్రికేయ మిత్రులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. ఐ అండ్​ పీఆర్​ శాఖామంత్రిగా పనిచేసిన నాని కూడా పాత్రికేయుల సమస్యలు గాలికొదిలేశారని మండిపడ్డారు. ఇప్పుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కూడా తనదీ అదే మార్గమని చెప్పకనే చెప్పినట్లు ఉందన్నారు.

కొద్ది నెలలు ఆగితే వైకాపా అనే దోపిడీ ముఠా మొత్తాన్ని సీబీఐ దత్తత తీసుకుంటుందన్నారు. అప్పుడు వారి సీబీఐ దత్తపుత్రుడికి చంచల్ గూడ జైల్లోనో.. చర్లపల్లి జైలులోనో ఆరాధన కార్యక్రమాలు, భజనలు పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. జనసేన పార్టీ.. ఎన్నికల మేనిఫెస్టో అంశాలను వైకాపా కాపీ కొట్టి అమలు చేస్తోందని ధ్వజమెత్తారు. రేషన్ సరుకుల కోసం రూ.2,500 నుంచి రూ.3,500 నగదు బదిలీ మహిళల ఖాతాలోకి జనసేన పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోని అంశమని పేర్కొన్నారు. ఈ పథకం జనసేన పార్టీ పథకమని.. ప్రజలు పవన్ కల్యాణ్​ను ఆదరించాలని కోరారు.

ఇదీ చదవండి: సీఎంను ఆరాధిస్తే... తప్పక ఇళ్ల స్థలాలు: మంత్రి చెల్లుబోయిన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.