రాజధాని నగరం అమరావతిని నిర్వీర్యం చేసి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్న వైకాపా ప్రభుత్వానికి రాబోయే ఎన్నికలలో ప్రజలు తమ ఓటుతో బుద్ది చెప్పాలని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ సూచించారు. విజయవాడలో నగరపాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన కార్పొరేటర్ అభ్యర్థుల జాబితాను పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు విడుదల చేశారు. జనసేన, భాజపా పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగాయని.. జనసేన నుంచి 38 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు మహేశ్ తెలిపారు.
ఇప్పటి వరకు విజయవాడలో వైకాపా చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని మహేశ్ డిమాండ్ చేశారు. తెదేపాలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువైపోయాయిందని.. వైకాపాలో అవినీతి, నేర చరిత్ర కలిగిన వారికే టిక్కెట్లు ఇచ్చారన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు.
ఇదీ చూడండి: ఎస్‌ఈసీ నిర్ణయంపై 4 లంచ్‌మోషన్ పిటిషన్లు.. విచారణకు స్వీకరించిన హైకోర్టు