ఇదీ చదవండి: PEOPLE PROTEST FOR WATER: భూములిచ్చాం.. కనీసం నీళ్లివ్వండి..
Kolatam event in Singareni school: కనువిందుగా జానపద కోలాటం.. - janapada kolatam event in singareni school
Kolatam event in Singareni school: తెలంగాణలోని మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి పాఠశాలలో గురువారం సాయంత్రం సందడి వాతావరణం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలు, యువతులు, కళాకారులతో పాఠశాల మైదానం కళకళలాడింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. మహిళలు కోలాటం ఆడుతూ ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. జానపద కోలాటం పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి సందడి చేశారు. పదుల సంఖ్యలో గీసిన వృత్తాకారాల్లో లయబద్ధంగా కోలాటాలు ఆడుతూ.. జానపద గీతాల ప్రత్యేకతను చాటారు.
అట్టహాసంగా జానపద కోలాటం.. ఆద్యంతం కనువిందు