విజయవాడలో జగద్గురు ఆది శంకరాచార్యుల జయంతిని ఇంద్రకీలాద్రిపై నిర్వహించారు. దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వీ.సురేష్ బాబు ఆధ్వర్యంలో ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వేద పండితులు, అర్చకులు సంయుక్తంగా ఆది శంకరాచార్యుల విగ్రహానికి పంచామృత అభిషేకం, శంకర పూజ, యదివందనవిధి నిర్వహించారు. అనంతరం వేద పండితులకు పూర్ణ ఫలాలు అందజేశారు.
ఇదీ చదవండి: