ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీఎండీసీ (APMDC) మూడు విభాగాల్లో ఐఎస్ఓ (ISO) ధృవీకరణ పత్రాలు సాధించిందని ఆ సంస్థ వీసీఎండీ వెంకట్ రెడ్డి వెల్లడించారు. క్వాలిటీ మేనేజ్‌మెంట్ స్టాండర్డ్స్‌లో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందన్నారు. దీంతో పాటు ఆరోగ్యం, భద్రత వంటి విషయాల్లోనూ ఏపీఎండీసీ అత్యున్నత ప్రమాణాలను పాటిస్తోందని తెలిపారు.
పర్యావరరణ పరిరక్షణలోనూ ఖనిజాభివృద్ధి సంస్థ ఉన్నత స్థాయి ప్రమాణాల్ని అనుసరిస్తోందని ఈ అంశాల్లో ఐఎస్ఓ ధృవీకరణ రావటం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఖనిజ విక్రయాల్లో నాణ్యతా ప్రమాణాలకు ఐఎస్ఓ ధృవీకరణ పత్రం గీటురాయి వంటిదని వెంకట్ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: