ETV Bharat / city

సింగపూర్​లో ‘అంతర్జాతీయ సాహిత్య సమ్మేళనం’

సింగపూర్​లో ‘శ్రీ సాంస్కృతిక కళా సారథి' అనే సంస్థ ఆవిర్భావం సందర్భంగా ‘అంతర్జాతీయ సాహిత్య సమ్మేళనం’ నిర్వహించారు. వర్చువల్‌ పద్ధతిన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థకు లేఖ ద్వారా తన అభినందనలు తెలిపారు.

singapore
‘అంతర్జాతీయ సాహిత్య సమ్మేళనం’
author img

By

Published : Jul 8, 2020, 10:49 PM IST

సింగపూర్​లో ‘అంతర్జాతీయ సాహిత్య సమ్మేళనం’ జరిగింది. శ్రీ సాంస్కృతిక కళాసారథి' అనే సంస్థ ఆవిర్భావం సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. 14 దేశాల నుంచి 50 మందికిపైగా సాహితీవేత్తలు, సాహిత్య అభిమానులు వక్తులుగా ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఐదున్నర గంటల పాటు వర్చువల్‌ పద్ధతిలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లేఖ ద్వారా తన శుభాభినందనలు తెలిపారు. సామవేదం షణ్ముఖశర్మ, గరికపాటి నరసింహారావు తమ సందేశాన్ని పంపించారు. 14 దేశాల నుంచి అంతర్జాలం ద్వారా ఈ విధమైన కార్యక్రమం జరగటం ఇదే మొదటిసారి కావటంతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్​లో ఈ సమ్మేళనం స్థానం సంపాదించుకుందని- తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అధ్యక్షులు వెంకటాచారి తెలిపారు.

ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ హాజరయ్యారు. శ్రీ సాంస్కృతిక కళాసారధి’ సంస్థ ద్వారా వర్థమాన కళాకారులు, రచయితలకు ప్రోత్సాహం అందించటం, సాంస్కృతిక ఆధ్యాత్మిక కళా రంగాలలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టడానికి తమవంతు ప్రయత్నిస్తామని నిర్వాహకులు తెలిపారు..

ఇదీ చదవండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలు సీజ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.