బుధవారం నిర్వహించాల్సిన ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలను అసని తుపాను కారణంగా ఈ నెల 25కు వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి శేషగిరిబాబు తెలిపారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గణితం, వృక్షశాస్త్రం, పౌరశాస్త్రం పరీక్షలు బుధవారం జరగాల్సి ఉంది. వీటిని అన్ని పరీక్షలూ పూర్తయ్యాక 25న నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రాలు, సమయాల్లో ఎలాంటి మార్పూ ఉండదు. ఈ నెల 12 నుంచి జరగాల్సిన పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయి.
* నేడు జరగాల్సిన ఎంబీబీఎస్, ఎంపీటీ థియరీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘అసని’ దిశ మార్చుకుంది. ఉత్తర కోస్తా- ఒడిశా మధ్యలో తీరం దాటుతుందనుకున్న తుపాను.. కృష్ణా జిల్లా మచిలీపట్నంవైపు దూసుకొస్తోంది. రేపు సాయంత్రలోపు మచిలీపట్నానికి సమీపంలో తీరం దాటే సూచనలు ఉన్నట్లు వాతావరణశాఖ (ఐఎండీ) అంచనా వేస్తోంది. మచిలీపట్నం వద్ద తీరాన్ని తాకి మళ్లీ విశాఖ వద్ద సముద్రంలోకి ప్రవేశించే అవకాశముందని ఐఎండీ భావిస్తోంది. తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.
ఇదీ చూడండి :