ETV Bharat / city

HC: ఒకసారిఅర్హులు.. తర్వాత అనర్హులెలా అవుతారు? - హైకోర్టు వార్తలు

పింఛను పొందేందుకు అర్హతలున్నా మంజూరు చేయకపోవడం, పింఛను పొందుతున్న వారికి నోటీసు ఇవ్వకుండానే రాజకీయ కారణాలతో నిలిపేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. వృద్ధాప్య, దివ్యాంగ పింఛన్లు పొందేందుకు ఒకసారి అర్హులైన వారు తర్వాత అనర్హులెలా అవుతారనేది అర్థంకాని విషయంగా ఉందని పేర్కొంది.

HC
HC
author img

By

Published : Oct 3, 2021, 4:59 AM IST

Updated : Oct 3, 2021, 10:31 AM IST

HC: ఒకసారిఅర్హులు.. తర్వాత అనర్హులెలా అవుతారు?

పింఛను పొందేందుకు అర్హతలున్నా మంజూరు చేయకపోవడం, పింఛను పొందుతున్న వారికి నోటీసు ఇవ్వకుండానే రాజకీయ కారణాలతో నిలిపేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. వృద్ధాప్య, దివ్యాంగ పింఛన్లు పొందేందుకు ఒకసారి అర్హులైన వారు తర్వాత అనర్హులెలా అవుతారనేది అర్థంకాని విషయంగా ఉందని పేర్కొంది. వితంతు, ఒంటరి మహిళల పింఛన్లను నిలిపేస్తే... తర్వాత వివాహం చేసుకున్నారనే కారణంగా భావించొచ్చని, కాని వృద్ధాప్య, దివ్యాంగుల స్థితిలో మార్పు ఉండదు కదా అని ప్రశ్నించింది. మెడికల్‌ బోర్డు, తహసీల్దార్‌ ఇచ్చిన ధ్రువపత్రాల ఆధారంగా పింఛనుల ఇస్తున్నారని గుర్తుచేసింది. ఆయా ధ్రువపత్రాల వాస్తవికతపై విచారణ చేయకుండా, గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది ఇచ్చిన నివేదికల ఆధారంగా పింఛన్లను నిలిపేస్తున్నారని ఆక్షేపించింది. ధ్రువపత్రాలు విశ్వసనీయమైనవి కాదని భావిస్తే... వాటిని జారీచేసిన అధికారులపై విచారణ చేయాలంది. లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్న తర్వాత, వారు సమర్పించిన ధ్రువపత్రం నిజమైంది కాదని రుజువైతేనే పింఛన్లను నిలిపేయాలని అధికారులకు స్పష్టంచేసింది. సామాజిక పింఛన్ల పథకానికి ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తోందని గుర్తుచేసింది. ప్రభుత్వం ప్రజాధనానికి ధర్మకర్తగా ఉండాలని పేర్కొంది. రాజకీయ కారణాలతో వివక్ష చూపకుండా ప్రజా సొమ్మును నిష్పక్షపాతంగా, సహేతకంగా ఖర్చు చేయాలంది. పింఛన్ల పథకం ప్రవేశపెట్టిన ప్రభుత్వ సదుద్దేశంపై కోర్టుకు ఎలాంటి సందేహం లేదని, అయితే కొందరు అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడంతో పథకం ఫలాలు అర్హులకు అందడం లేదని పేర్కొంది. పింఛన్లు నిలిపేయడాన్ని, అర్హతలున్నా ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ అనంతపురం, ప్రకాశం, శ్రీకాకుళం తదితర జిల్లాలకు చెందిన పలువురు హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు. వాటిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఈ మేరకు ఇటీవల తీర్పు ఇచ్చారు.

పింఛన్లు నిలిపేసిన వారి విషయంలో...

* పిటిషనర్లకు ఏ నెల నుంచి పింఛను నిలిపేశారో అప్పటి నుంచి ఇప్పటి వరకు రావాల్సిన మొత్తాన్ని తక్షణం చెల్లించండి.

* పిటిషనర్ల గ్రామాలకు వెళ్లి సంబంధిత మండలాల ఎంపీడీవోలు వారం రోజుల్లో దస్త్రాలను స్వీకరించి, పరిశీలించాలి. రెండు రోజుల ముందే పిటిషనర్లకు సమాచారం ఇవ్వాలి. ఒకవేళ ఎంపీడీవో పనిఒత్తిడిలో ఉంటే పంచాయతీ కార్యదర్శి, వీఆర్‌వోలకు ఆ బాధ్యతను అప్పగించాలి.

* పింఛను పొందేందుకు తమ అర్హతలను తెలిపే దస్త్రాలను పిటిషనర్లు ఎంపీడీవోకు సమర్పించాలి. వాటిని పరిశీలించాక వారంలో పిటిషనర్ల పేర్లను అర్హుల జాబితాలోకి చేర్చాలి.

* ఒకవేళ అనర్హులని భావిస్తే... కారణాలను రాతపూర్వకంగా తెలియజేయాలి. ఈ ప్రక్రియను మూడు వారాల్లో పూర్తి చేయాలి.

* పింఛను కోసం తాజాగా దరఖాస్తు చేసుకున్న వారి విషయంలోనూ ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు ప్రక్రియను పూర్తి చేయాలి.

ఇదీ చదవండి:

SAND ILLEGAL TRANSPORT : ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు కంట్రోల్ రూమ్‌

Last Updated : Oct 3, 2021, 10:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.