High court on solar power: సోలార్ పవర్ కార్పొరేషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేయడంపై హైకోర్టులో విచారణ జరిగింది. మార్కెట్‌లో రూ.2.05కు వస్తుంటే రూ.2.45కు కొనడాన్ని సవాల్ చేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు న్యాయవాది ఆదినారాయణరావు పిటిషనర్ తరఫున వాదనలు వినిపించారు.
సెకీ ద్వారా రాష్ట్రానికి విద్యుత్ ఇచ్చేందుకు అదానీ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు వాదనలు విన్న ధర్మాసనం కేంద్రం, అదానీ సంస్థ, రాష్ట్ర ఇంధన శాఖ సహా 10 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఇదీ చదవండి: