ETV Bharat / city

jobs: ప్రతిభకు తగ్గ ప్యాకేజీ!..డిజిటలీకరణతో ఐటీలో పెరిగిన ఉద్యోగాలు

ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రాంగణ నియామకాల సందడి మొదలైంది. ఐటీ కంపెనీల అవసరాలు పెరగడంతో గతేడాదితో పోల్చితే ఈసారి నియామకాలు 20 శాతానికిపైగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగుల ఎంపికకు కంపెనీలు ఆన్‌లైన్‌లో జాతీయ స్థాయి ప్రతిభా పరీక్షలతోపాటు ప్రాంగణ ఎంపికలను నిర్వహిస్తున్నాయి.

డిజిటలీకరణతో ఐటీలో పెరిగిన ఉద్యోగాలు
డిజిటలీకరణతో ఐటీలో పెరిగిన ఉద్యోగాలు
author img

By

Published : Sep 5, 2021, 4:12 AM IST

ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రాంగణ నియామకాల సందడి మొదలైంది. ఐటీ కంపెనీల అవసరాలు పెరగడంతో గతేడాదితో పోల్చితే ఈసారి నియామకాలు 20 శాతానికిపైగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగుల ఎంపికకు కంపెనీలు ఆన్‌లైన్‌లో జాతీయ స్థాయి ప్రతిభా పరీక్షలతోపాటు ప్రాంగణ ఎంపికలను నిర్వహిస్తున్నాయి. కరోనా కారణంగా డిజటలీకరణ వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో ఐటీ ఉద్యోగాలకు డిమాండు ఏర్పడింది. సాఫ్ట్‌వేర్‌ను రూపొందించే ప్రొడక్ట్‌, స్టార్టప్‌ కంపెనీలు ఈసారి నియామకాలను పెంచాయి. మరోవైపు అధిక వేతనాల ఆఫర్లు రావడంతో 2020-21లో వివిధ కంపెనీలను 30% మంది ఉద్యోగులు వదిలి వెళ్లారు.

కొనసాగుతున్న ఎంపిక ప్రక్రియ

తాము ఎంపిక చేసుకున్న వివిధ కళాశాలల్లో కొన్ని కంపెనీలు నియామకాలకు పూర్తి చేయగా.. మరికొన్ని కొనసాగిస్తున్నాయి. టీసీఎస్‌ నింజా పరీక్ష ఈనెల 12న, విప్రో ఎలైట్‌ నేషనల్‌ టాలెంట్‌ హంట్‌ జాతీయ స్థాయి పరీక్ష ఇదే నెల 25 నుంచి జరగనుంది.
* కాగ్నిజెంట్‌ జెన్సీ పరీక్ష శనివారం జరిగింది. జెన్సీ ఎలివేట్‌ 11న నిర్వహించనుంది. వివిధ కళాశాలల్లో టీఎస్‌ డిజిటల్‌, టీఎస్‌ డీఎస్‌సీ నియామకాలు పూర్తయ్యాయి. విప్రో టాలెంట్‌ నెక్స్ట్‌ 15న, ఆక్సెంచర్‌, క్యాప్‌జెమినీ, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ ఈనెల చివరి నుంచి అక్టోబరు చివరిలోపు నియామకాలను పూర్తి చేయనున్నాయి.
* వర్చుసా కంపెనీ న్యూరల్‌ హ్యాకథాన్‌ పేరిట జాతీయ స్థాయి ప్రోగ్రామింగ్‌ కోడింగ్‌ పోటీలు నిర్వహిస్తోంది. దీని ద్వారా 2వేల మందిని తీసుకుంటుందని అంచనా.
* డిజిటల్‌ నియామకాలకు ఐటీ కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ ఉద్యోగాలకు ప్రాథమికంగా రూ.3.5 లక్షల నుంచి, నైపుణ్యముంటే రూ.7.50 లక్షల వరకు వేతన ప్యాకేజీలను ఇస్తున్నాయి. తాము ఎంపిక చేసుకున్న విద్యార్థులకు ఎనిమిదో సెమిస్టర్‌లోనే ఇంటర్న్‌షిప్‌, టీసీఎస్‌ ఎక్స్‌ప్లోర్‌, ఇన్ఫోసిస్‌ లెక్స్‌, కాగ్నిజెంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రొగ్రామ్‌లపై శిక్షణ ఇస్తున్నాయి.

* నియామకాలు 20 శాతానికిపైగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని విజయవాడ పీవీపీ సిద్దార్థ కళాశాల ప్రాంగణ నియామక అధికారి రమేష్‌ తెలిపారు.
డిజిటల్‌ నైపుణ్యాలు, కోడింగ్‌పై పట్టున్న వారికి రూ.6 లక్షల నుంచి రూ.20 లక్షలకుపైగా ప్యాకేజీలు వస్తున్నాయని వెల్లడించారు.
* టీసీఎస్‌ డిజిటల్‌ ద్వారా నింజాకు గతేడాది 25 మంది ఎంపికైతే ఈసారి 62 మంది ఎంపికయ్యారని గుంటూరు ఆర్‌వీఆర్‌, జేసీ ప్రాంగణ నియామక అధికారి సీహెచ్‌.శ్రీనివాసరావు తెలిపారు. ఐటీ కంపెనీలు ఎంపిక చేసిన కళాశాలల్లో నియామకాలతోపాటు ఓపెన్‌ పరీక్ష విధానాన్ని నిర్వహిస్తుండటంతో విద్యార్థులకు అవకాశాలు పెరుగుతున్నాయని ఏపీ శిక్షణ ఉపాధి అధికారుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి సురేంద్ర వెల్లడించారు.
* విశాఖపట్నంలోని గాయత్రి విద్యా పరిషత్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రతినిధి మాట్లాడుతూ... తమ కళాశాల నుంచి టీసీఎస్‌ డిజిటల్‌కు నిరుడు 55 మంది ఎంపికయ్యారని, ఈసారి మొదటి రౌండ్‌కే 47 మంది రూ.7.70 లక్షల వేతన ప్యాకేజీ సాధించారని తెలిపారు. మోదక్‌ ఎనలిటిక్స్‌ కంపెనీకి గతేడాది నలుగురు ఎంపికవగా.. ఈసారి 44 మందికి రూ.6 లక్షల ప్యాకేజీ వచ్చిందన్నారు.

భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు కీలకం

విద్యార్థుల్లో భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు పరిశ్రమలకు తగిన స్థాయిలో లేవని ఐటీ పరిశ్రమ వర్గాల ద్వారా వినిపిస్తోంది. ఉద్యోగార్థులు దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరముంది. మొదటి త్రైమాసికంలో ప్రాంగణ నియామకాల్లో ఎంపిక కాలేదనే భయాన్ని వదిలి, తిరిగి ప్రయత్నిస్తే మంచి అవకాశాలు లభిస్తాయి.

కోటా సాయికృష్ణ, ప్రాంగణ నియామకాల అధికారి, గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కళాశాల

నైపుణ్యాలుంటే మంచి ప్యాకేజీలు

విద్యార్థులు కోడింగ్‌పై పట్టు సాధించాలి. అవసరమైన నైపుణ్యాలను పెంచుకుంటే మంచి వేతన ప్యాకేజీలు లభిస్తాయి. ప్రతిభ ఉన్న వారు రెండు, మూడు ఉద్యోగాలకు సైతం ఎంపికవుతున్నారు. ప్రాంగణ నియామకాలు ఈ ఏడాది ఆశాజనకంగా ఉన్నాయి.

- పి.వెంకట్రావు, అధ్యక్షుడు, ఏపీ ఉపాధి అధికారుల సమాఖ్య

ఇవి ఉంటే అధిక వేతనాలు

* లాజికల్‌ రీజనింగ్‌, ఆప్టిట్యూడ్‌, కోడింగ్‌లను కంపెనీలు పరీక్షిస్తున్నాయి. కోడింగ్‌లో జావా, పైథాన్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజీలతోపాటు రిలేషనల్‌ డేటాబేస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టంపై పట్టు కలిగి ఉండటం ఎంతో అవసరం. ఏ కంపెనీ అయినా వీటినే చూస్తున్నాయి.

* భారీ ప్యాకేజీలకు వెళ్లానుకునేవారు సైబర్‌ సెక్యూరిటీ, ఐవోటీ, ఏఐ, మిషన్‌ లెర్నింగ్‌లలో సర్టిఫికేషన్‌తోపాటు ప్రాజెక్టు చేసిన అనుభవం ఉంటే మంచిది. అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌, సెల్స్‌ కోర్సు, సిస్‌కోలాంటి సర్టిఫికెట్‌ కోర్సులు చేసిన వారికి కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి.

ఇదీ చదవండి: TDP: మహిళలపై దాడులకు నిరసనగా తెదేపా కొవ్వొత్తుల ర్యాలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.