ప్రముఖ రచయిత, సాహితీ విమర్శకులు ఆచార్య కొలకలూరి ఇనాక్ రాసిన మనూళ్లలో మాకథలు అనే పుస్తకాన్ని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, ఐపీఎస్ అధికారి సత్యనారాయణ ఆవిష్కరించారు. విజయవాడలోని ఓ హోటల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు రచయితలు, సాహితీ ప్రియులు పాల్గొన్నారు. తెలుగు సాహిత్యంలో ఇనాక్ కొత్త ఒరవడి సృష్టించారని.. ఆయన రాసిన ఎన్నో కథలు, నాటకాలు జనబాహుళ్యంలో విశేష ఆదరణ పొందాయని వక్తలు కొనియాడారు. ఇదే కార్యక్రమంలో కొలకలూరి ఇనాక్ జీవితంపై.. మరో రచయిత విహారి రచించిన అద్వితీయ పుస్తకాన్నీ అతిథులు ఆవిష్కరించారు.
ఇదీ చదవండి