new year celebrations : తెలంగాణలోని హైదరాబాద్‌లో కొత్త ఏడాది వేడుకలు ఏటా ఎంతో ఆడంబరంగా జరుగుతుంటాయి. వేడుకలు, కేరింతలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. అయితే ఈసారి పెరుగుతున్న కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. అయినప్పటికీ నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు నగరవాసులు సంసిద్ధులయ్యారు. ప్రభుత్వ పరంగా ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు లేకపోయినా వస్త్ర, వాణిజ్య, వ్యాపార సముదాయాలు ముస్తాబయ్యాయి. బేకరీలు, రెస్టారెంట్లు నగరవాసులను ఆకర్షించేందుకు.. మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపపు కాంతుల నడుమ సరికొత్త కేకులు, బహుమతులను అందజేస్తున్నాయి.
ఇంట్లోనే వేడుకలు..
కొవిడ్ కేసులు తిరిగి పెరుగుతుండటంతో.. నెలకొన్న భయాల నడుమ సురక్షితంగా వేడుకలు చేసుకుంటామని నగరవాసులు చెబుతున్నారు. ఇంట్లో ఉంటూనే వేడుకలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతామని అంటున్నారు. మరోవైపు ఈ నూతన ఏడాదిలోనైనా అయినా వ్యాపారం పెరుగుతుందని దుకాణదారులు ఆశిస్తున్నారు.
పూర్తైన ఏర్పాట్లు
గతేడాది కొవిడ్ ఉద్ధృతితో వేడుకలు జరగకపోవడంతో.. ఈసారి కొవిడ్ ఆంక్షల నడుమ కొత్త ఏడాదికి స్వాగతం పలికేందకు నగరవాసులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఇదీ చూడండి:
తెలుగురాష్ట్రాల సీఎస్‌లకు కేంద్రం పిలుపు.. ఆ అంశాలపై చర్చించేందుకే..!