ETV Bharat / city

అన్నదాతను నిలువునా ముంచిన కృష్ణమ్మ - అన్నదాతను నిలువునా ముంచిన కృష్ణమ్మ

కృష్ణమ్మ ఉద్ధృతికి వేల ఎకరాల్లో పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో లంక గ్రామాలు ఇంకా నీటిలోనే మగ్గుతున్నాయి. కరకట్ట నుంచి సుమారు 3కిలోమీటర్ల మేర వరద సముద్రాన్ని తలపిస్తోంది. ముంపు గ్రామాల్లో అధికారులు పడవల ద్వారా సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

అన్నదాతను నిలువునా ముంచిన కృష్ణమ్మ
author img

By

Published : Aug 18, 2019, 5:53 AM IST

అన్నదాతను నిలువునా ముంచిన కృష్ణమ్మ

కృష్ణమ్మ మహోగ్రరూపానికి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని నదీ పరివాహక ప్రాంతాల ప్రజల్లో భయాందోళనలు కొనసాగుతున్నాయి. వరదలకు గుంటూరు జిల్లాలోని 14 మండలాల్లో 53 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. క్రోసూరు, అమరావతి, తుళ్లూరు, దుగ్గిరాల, భట్టిప్రోలు, రేపల్లె మండలాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. కొల్లూరు, కొల్లిపొర మండలాల్లోని 21 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల కరకట్లకు గండ్లు పడి... రహదారి సౌకర్యాలు మూసుకుపోయాయి. కొల్లిపొర మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్తున్న అధికారుల వాహనం వరద నీటిలో చిక్కుకుంది.

అమరావతి, తుళ్లూరు మండలాల్లోని రైతులకు వరదలు అపార నష్టాన్ని మిగిల్చాయి. దాదాపు 12వేల ఎకరాల్లో పత్తి పంట నీట మునిగింది. మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాలలో నిమ్మ, జామ, కూరగాయల తోటలు చెరువులను తలపిస్తున్నాయి. దుగ్గిరాల నుంచి రేపల్లె వరకు కృష్ణా తీరం వెంట ఉన్న 21గ్రామాల్లో... పసుపు, కంద, అరటి పంటలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. ఇప్పటికే దెబ్బతిన్న పంటలు... ఇంకా నీటిలో నానితే కోలుకోవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదల్లో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరఫున వీలైనంత ఎక్కువగా నష్ట పరిహారం అందించేలా కృషి చేస్తామని ప్రజాప్రతినిధులు తెలిపారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఎన్డీఆర్​ఎఫ్, ఎస్డీఆర్​ఎఫ్​, అగ్నిమాపక సిబ్బంది లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రబ్బరు బోట్ల సాయంతో మంచినీరు, ఆహారం సరఫరా చేస్తున్నారు. ఆహారం వద్దన్న చోట్ల బియ్యం అందజేస్తున్నారు. గుంటూరు జిల్లాలో 15పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 3వేల 500మందికి వాటిలో ఆశ్రయం కల్పించినట్లు చెప్పారు. 32చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పలు గ్రామాల్లో విద్యుత్‌ సౌకర్యాలు మెరుగుపరిచినట్లు వివరించారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు పర్యటిస్తున్నారు. కొల్లూరు మండలంలోని లంక గ్రామాల్లో మంత్రి మోపిదేవి వెంకటరమణ బోటులో పర్యటించారు. ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు అన్నాబత్తుని శివకుమార్, మేరుగ నాగార్జున, ఆళ్ల రామకృష్ణారెడ్డి తమతమ నియోజకవర్గాల పరిధిలో పరిస్థితిని పరిశీలించారు. ఒక్కో రైతు ఎకరానికి 50వేలకు పైగా పెట్టుబడి పెట్టారని... కనీసం 10వేలు ప్రభుత్వ సాయం అందేలా ప్రయత్నిస్తామని ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. ప్రకాశం బ్యారేజికి వరద తగ్గితే పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండీ...

కృష్ణా నది వరదలపై ఫోన్​లో సీఎం ఆరా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.