గులాబ్ తుపాను ప్రభావంతో విజయవాడ చిట్టినగర్ సొరంగ మార్గం సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఇళ్ల మధ్య, మెట్ల దారిలో కొండ రాళ్లు పడటంతో రెండు గృహాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఇళ్లు దెబ్బతిన్న వారికి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.