HOSPITAL TO RTC EMPLOYEES: ఏపీఎస్ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు, వారి జీవిత భాగస్వాములకు హైదరాబాద్‌లో ఉచిత వైద్యంతోపాటు మందులు అందనున్నాయి. హైదరాబాద్ తార్నాకలో ప్రస్తుతమున్న ఆర్టీసీ ఆస్పత్రిలోనే కొత్తగా ప్రత్యేక విభాగాన్ని ఏపీ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు శనివారం ప్రారంభించారు.
అక్కడ సీనియర్ వైద్యాధికారి, ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్, ఇతర సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చే సుమారు రెండు వేల మంది డ్రైవర్లు, కండక్టర్లకు సైతం అత్యవసర సమయాల్లో ఇక్కడ వైద్యం అందిస్తారు. అవసరమైతే స్పెషాలిటీ ఆసుపత్రులకు సిఫారసు చేసే అధికారం వైద్యాధికారికి ఉంటుంది. కార్యక్రమంలో ఈడీ కోటేశ్వరరావు, ఆర్టీసీ ముఖ్య వైద్యాధికారి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: