ETV Bharat / city

DISHA APP: దిశా యాప్​పై అవగాహన కల్పిస్తాం: హోంమంత్రి సుచరిత - sithanagaram case news

సీతానగరం అత్యాచారం కేసుకు సంబంధించిన వివరాలు సీఎం జగన్​కు తెలియజేశామని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. నిందితులను నిర్ధారించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారని చెప్పారు. మహిళల భద్రతా దృష్ట్యా దిశా యాప్​పై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు.

home minister sucharita
హోంమంత్రి మేకతోటి సుచరిత
author img

By

Published : Jun 23, 2021, 4:58 PM IST

సీతానగరం ఘటన కేసు పురోగతిని సీఎం జగన్​కు వివరించామని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఇద్దరు అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారని తెలిపారు. నిందితులు ఎవరో నిర్ధారించి.. వారిని కోర్టులో ప్రవేశపెడతామని చెప్పారు. సీతానగరం ఘాట్ వద్ద నిఘా పెంచాలని సీఎం ఆదేశించారని హోంమంత్రి వెల్లడించారు. కృష్ణానది తీర ప్రాంతమంతటా సీసీ కెమెరాల ఏర్పాటు సాధ్యం కాదని ఆమె అన్నారు. నిర్జన ప్రదేశాలకు వెళ్తే బంధువులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. దిశా యాప్‌పై అవగాహన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.

ఇదీ చదవండి: cm jagan: మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాలి: సీఎం జగన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.