ETV Bharat / city

High Court: ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణపై వ్యాజ్యం.. జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరణ

High court: ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరించేలా.. ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంలో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రతి వ్యవహారం పిల్ కిందకు రాదని స్పష్టం చేసిన హైకోర్టు.. ఈ వ్యాజ్యాన్ని కొట్టేసింది.

high court
హైకోర్టు
author img

By

Published : Jun 15, 2022, 10:16 AM IST

High court: ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరించేలా.. ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంలో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. బాధితులు కోర్టును ఆశ్రయించి రిట్ దాఖలు చేసుకోవాలి తప్ప.. ఈ వ్యవహారంలో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేయడం ఏమిటని పిటిషనర్​ను ప్రశ్నించింది. ప్రతి వ్యవహారం పిల్ కిందకు రాదని స్పష్టం చేసిన హైకోర్టు.. ఈ వ్యాజ్యాన్ని కొట్టేసింది.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్ర, జస్టిస్ డీవీఎస్ఎన్ సోమయాజులతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. 2017 ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 388 ప్రకారం.. అభ్యంతరం లేని ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ స్థలాలను ఉందని, దానిని నిలుపుదల చేయడాన్ని సవాలు చేస్తూ విశాఖ తూర్పు తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హైకోర్టులో పిల్ వేశారు. జీవో 388 కి అనుగుణంగా క్రమబద్ధీకరించాలని వివిధ వర్గాలకు చెందిన ప్రజలు.. లక్షకుపైగా దరఖాస్తులు చేసుకోగా.. ప్రభుత్వం ప్రక్రియను నిలుపుదల చేసిందని, పిటిషనర్ న్యాయవాది వాదనలు వినిపించారు.

ధర్మాననం జోక్యం చేసుకుంటూ బాధిత వ్యక్తులు కోర్టును ఆశ్రయించవచ్చని, ఈ వ్యవహారంపై పిల్ ఎలా వేస్తారని ప్రశ్నించింది. న్యాయవాది బదులిస్తూ.. ఇది ఒకరి వ్యవహారం కాదని, పేదల ప్రయోజనం కోసం ప్రజాప్రతినిధి హోదాలో పిటిషనర్ పిల్ వేశారన్నారు. జీవో 388 ప్రకారం ఉన్న పథకాన్ని నిలుపుదల చేసి, కొత్త జీవో తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్ధీకరణను అమలు చేస్తోందన్నారు. ఈ వ్యవహారంలో హైకోర్టు జోక్యం చేసుకోవాలన్నారు. ఆ వాదనలను తోసిపుచ్చిన ధర్మాననం.. వ్యాజ్యాన్ని కొట్టేసింది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.