కన్వీనర్ కోటాలో మెడికల్ పీజీ ప్రవేశాలు పొందినవారిని యాజమాన్య కోటాలో అనుమతించట్లేదని చింతా మౌనిక అనే విద్యార్థిని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మేనేజ్మెంట్ కోటాలో ప్రవేశం పొందాలంటే కన్వీనర్ కోటాలో సీటు వదులుకోవాలని పెట్టిన నిబంధనపై హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌పై వాదనలు వినిపించిన పిటిషనర్ తరపు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్.. యాజమాన్య కోటాలో అనుమతించకపోవడం చట్టవిరుద్ధమన్నారు. యాజమాన్య కోటాలో సీట్లు ఇవ్వకూడదనే దురుద్దేశంతోనే యూనివర్సిటీ విద్యార్థులకు అన్యాయం చేసిందని వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం.. ప్రస్తుతానికి పిటిషనర్‌ని మేనేజ్మెంట్ కోటాలో కౌన్సెలింగ్‌కు అనుమతించాల్సిందిగా ఎన్టీఆర్ యూనివర్సిటీకి ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి: మంత్రివర్గ సమావేశం ప్రారంభం.. రాజీనామా చేయనున్న మంత్రులు !