ETV Bharat / city

ఎమ్మెల్యే వంశీ అనుచరుల అక్రమ తవ్వకాలను వెంటనే ఆపండి: హైకోర్టు

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆదేశాలతో పలువురు వ్యాపారులు గనుల అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారని, దేవాలయాన్నీ కూల్చేశారని దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. గనుల తవ్వకాలు తక్షణమే నిలిపేయాలని, చెట్ల కూల్చివేతను నిలువరించాలని ఆదేశించింది. కొండపై కొత్త ఆలయ పనులను ఆపాలని నిర్దేశించింది. గనుల తవ్వకాల కోసం దేవుళ్ల విగ్రహాలనూ మార్చేస్తుంటే ఏం చేస్తున్నారని దేవాదాయశాఖ అధికారులను సూటిగా ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ.. విచారణను వాయిదా వేసింది.

ap highcourt
హైకోర్టు
author img

By

Published : Oct 12, 2022, 7:18 AM IST

కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం గ్రామంలో శ్రీ బ్రహ్మయ్య లింగేశ్వరస్వామి దేవాలయ పరిసరాల్లో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు, చిన్నతరహా ఖనిజాల వెలికితీతను అడ్డుకోవాలని.. గతంలో గుడి ఉన్నచోటే విగ్రహాలను పునఃప్రతిష్టించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ.. మాజీ సైనికుడు ముప్పనేని రవికుమార్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ జరగ్గా.. పిటిషనర్‌ తరఫున న్యాయవాది ఎంఆర్​కే చక్రవర్తి వాదనలు వినిపించారు.

ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ ఆదేశాల మేరకు అన్నే లక్ష్మణరావు, ఓలుపల్లి మోహనరంగారావు, కె.శేషుకుమార్‌తో పాటు పలువురు వ్యాపారులు గనుల అక్రమ తవ్వకాలు జరిపినట్లు నివేదించారు. బ్రహ్మలింగయ్య చెరువు సమీపంలో సహజసిద్ధంగా పెరిగిన వేల చెట్లను కూల్చివేశారని తెలియజేశారు. ఆగిరిపల్లి మండలం నర్సింగపాలెం, చిక్కవరం గ్రామం ఆర్​ఎస్​ -2 పరిధిలో.. కోటగట్టుపై అనధికారికంగా నిర్మిస్తున దేవాలయాన్ని అడ్డుకోవాలని కోరారు. బహ్మయ్య లింగేశ్వరస్వామి దేవాలయం ఉన్నచోటే విగ్రహాలను పునఃప్రతిష్టించేలా ఆదేశాలు జారీ చేయాలని విన్నవించారు.

గతంలో పిటిషనర్‌ రాసిన లేఖను సుమోటో ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి.. కొండ దిగువ భాగంలోని దేవాలయంలోనే విగ్రహాలను పునఃప్రతిష్టించాలని హైకోర్టు ఆదేశించిందని గుర్తుచేశారు. అయినా అధికారుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్​ఎస్​ సోమయాజులు ధర్మాసనం.. గనుల తవ్వకాలు తక్షణమే నిలిపేయాలని, చెట్ల కూల్చివేతను నిలువరించాలని ఆదేశించింది.

కొండపై నూతన ఆలయ పనులను ఆపాలని స్పష్టంచేసింది. గనుల తవ్వకాల కోసం దేవుళ్ల విగ్రహాలను కూడా మార్చేస్తుంటే దేవాదాయశాఖ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులు అమలు చేయనందుకు బాధ్యులైన అధికారులపై ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేయాలని పిటిషనర్‌కు సూచించింది. గనుల శాఖ తరఫున స్పందించిన ప్రభుత్వ న్యాయవాది నవీన్‌... కోర్టు ముందు పిటిషనర్‌ ఉంచిన ఫోటోలు 2017 నాటివని చెప్పారు. వివరాల సమర్పణకు సమయం కావాలని కోరారు. అందుకు అంగీకరించిన హైకోర్టు.. విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.