Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో.. మొదటి నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిలును రద్దు చేయాలని కోరుతూ.. హైకోర్టులో సీబీఐ పిటిషన్ వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేశ్ వద్దకు.. ఈ వ్యాజ్యం విచారణకు వచ్చింది.
సీబీఐ తరపు న్యాయవాది ఎ.చెన్నకేశవులు స్పందిస్తూ.. గంగిరెడ్డిని ప్రతివాదిగా చేర్చిన నేపథ్యంలో నోటీసులు జారీచేయాలని కోరారు. ఆ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. నిందితుడు గంగిరెడ్డికి నోటీసులు జారీచేశారు.
పులివెందుల జ్యుడీషియల్ మొదటి తరగతి మెజిస్ట్రేట్ కోర్టు.. జూన్ 2019లో మంజూరు చేసిన డిఫాల్డ్ బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ కోరింది. వాదనలు విన్న న్యాయస్థానం.. విచారణను ఈనెల 23కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: