హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో డ్రైనేజీ, వరదనీటి నిర్వహణ వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉందంటూ డెక్కన్ ఆర్కియాలాజికల్, కల్చరల్ రీసెర్చి సొసైటీలు తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి. విజయ్‌సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. వరద నీటి వ్యవస్థ సరిగా లేక వార్డుల్లో నీరు నిలుస్తోందని పిటిషన్లో పేర్కొన్నారు.
గతంలో భారీ వర్షాలు కురిసినప్పుడు ఉస్మానియా ఆసుపత్రిలో రోగులు ఇబ్బంది పడ్డారని హైకోర్టు ప్రస్తావించింది. మరో వారం, పది రోజులు వర్షాలు కురిసే అవకాశముందని చెబుతున్నందున ఆసుపత్రి అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాల నేపథ్యంలో ఏం చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. విచారణ నవంబర్ 12కు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: