ప్రైవేట్ కొవిడ్ ఆస్పత్రుల్లో అధిక ఫీజుల వసూళ్లపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ప్రభుత్వం చేపట్టిన చర్యలపై కౌంటర్ అఫిడవిట్ సమర్పించాలని అదనపు అడ్వకేట్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది. రెండు వారాల్లో పూర్తి వివరాలు కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీచేసింది.
ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారని ఏఏజీని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించగా... కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నామని అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి సమాధానమిచ్చారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త తోట సురేష్ బాబు తరపున న్యాయవాది నర్రా శ్రీనివాసరావు ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
ఇదీ చదవండి:
తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు... కల్పవృక్షవాహనంపై శ్రీవారి దర్శనం