ETV Bharat / city

సుమోటోగా స్వీకరించిన డాక్టర్‌ సుధాకర్ వ్యాజ్యం మూసేసిన హైకోర్టు - ap high court

విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి మత్తు వైద్య నిపుణులు డాక్టర్ కె.సుదాకర్ వ్యవహారంలో సంబంధిత సీబీఐ కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశామని హైకోర్టుకు సీబీఐ నివేదించింది. బాధ్యులపై పోలీసులపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిందని తెలిపింది.

సుమోటోగా స్వీకరించిన డాక్టర్‌ సుధాకర్ వ్యాజ్యం మూసేసిన హైకోర్టు

author img

By

Published : Feb 17, 2022, 4:52 AM IST

విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి మత్తు వైద్య నిపుణులు డాక్టర్ కె.సుదాకర్ వ్యవహారంలో సంబంధిత సీబీఐ కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశామని హైకోర్టుకు సీబీఐ నివేదించింది. బాధ్యులపై పోలీసులపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిందని తెలిపింది. ఈ నేపథ్యంలో చార్జిషీట్ వేశామంది. పిటిషన్ పై విచారణ మూసివేయాలని కోరింది. మరోవైపు ఈ కేసులో కోర్టుకు సహాయకులుగా వ్యవహరిస్తున్న అమికస్ క్యూరీ, సీనియర్ న్యాయవాది పి. వీరా రెడ్డి సైతం పిల్ పై విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదన్నారు. ఆ వివరాలను నమోదు చేసిన ధర్మాసనం వ్యాజ్యంపై విచారణను మూసివేసింది.

సహకారం అందించినందుకు అమికస్ క్యూరీ వీరా రెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది. మరోవైపు సాధ్యమైనంత త్వరగా కేసును విచారించాలని సంబంధిత సీబీఐ కోర్టును ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్ర, జస్టిస్ ఎస్. సుబ్బారెడ్డితో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది. డాక్టర్ కె. సుధాకర్ విశాఖ పోలీసులు వ్యవహరించిన తీరు పై వీడియో క్లిప్పింగ్ ను జతచేస్తూ తెదేపా మహిళా విభాగం నేత రాసిన లేఖను హైకోర్టు సుమోటో పిల్ గా పరిగణించి విచారణ జరిపింది. 2030 మే 22 న సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. తాజాగా జరిగిన విచారణలో సీబీఐ తరపు న్యాయవారి చెన్నకేశవులు వాదనలు వినిపిస్తూ... ఎస్సై ,హెడ్ కానిస్టేబుల్, కాని స్టేబుళ్లను ప్రాసిక్యూట్ చేసేందుకు ప్రభుత్వ అనుమతి ఇచ్చిందన్నారు. సంబంధిత సీబీఐ కోర్టులో అభియోగపత్రం వేశామన్నారు.

ఇదీ చదవండి:

నేడు విజయవాడలో నితిన్‌ గడ్కరీ పర్యటన...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.