ఏపీ సీఐడీ ఇచ్చిన నోటీసు విషయంలో న్యాయవాది జడ శ్రావణ్ కుమార్‌కు హైకోర్టులో ఊరట లభించింది. యూనివర్సిటీల ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుల నియామకం విషయంలో చోటు చేసుకున్న అక్రమాలపై ఓ టీవీ చర్చా కార్యక్రమంలో మాట్లాడిన అంశాలకు సంబంధించిన దస్త్రాలను తమకు సమర్పించాలని సీఆర్‌పీసీ సెక్షన్ 91 ప్రకారం ఆయనకు సీఐడీ ఇచ్చిన నోటీసు అమలును హైకోర్టు నిలుపుదల చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాత్ రాయ్ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించారు.
సీఐడీ నోటీసు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది శ్రావణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ తరపు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపిస్తూ.. పదవీ విరమణ చేసి మరికొన్ని రోజుల కాల పరిమితి పొందిన అధికారి, హెచ్ఎస్వోగా బాధ్యతలు నిర్వహించడానికి వీల్లేదని అన్నారు. కేవలం పరిపాలనాపరమైన విధుల్ని మాత్రమే నిర్వర్తించగలరని వివరించారు. పదవీ విరమణ పొందిన అధికారి నోటీసు ఇవ్వడం చట్ట సమ్మతం కాదన్నారు. నిందితునికే నోటీసు ఇచ్చి, వ్యతిరేకమైన సాక్ష్యం ఇవ్వాలని కోరడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం అన్నారు.
రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు