పదో తరగతి, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలన్న డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. తల్లిదండ్రులు సహా పలు రాజకీయ పార్టీలు, సామాజిక కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. విజయవాడలో టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని.. మద్యం దుకాణాలు పూర్తిగా బంద్ చేయాలని డిమాండ్ చేస్తూ హైకోర్టు న్యాయవాది, జైభీమ్ యాక్సిస్ జస్టిస్ వ్యవస్థాపకులు జడ శ్రవణ్ కుమార్ మౌన దీక్ష చేపట్టారు. రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తుంటే.. పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించడం, మద్యం దుకాణాలు నిర్వహించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు
ఇదీ చదవండి: నన్ను అరెస్టు చేసే అవకాశం ఉంది: దేవినేని