ఇంటర్ పరీక్షల(TS Inter exams) నిర్వహణపై తాము జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు(Ts Hight Court) స్పష్టం చేసింది. ఈ నెల 25 నుంచి జరగాల్సిన ఇంటర్ మొదటి పరీక్షలు(TS Inter exams) రద్దు చేయాలంటూ.. తెలంగాణ రాష్ట్ర తల్లిదండ్రుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం(Ts Hight Court) అత్యవసర విచారణ చేపట్టింది.
ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు(TS Inter exams) రద్దు చేయాలని పిటిషనర్ కోర్టును కోరారు. ఇప్పటికే ప్రమోటైన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించొద్దని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం(Ts Hight Court).. ఈ నెల 25 నుంచి పరీక్షలు ఉండగా.. ఇప్పుడు పిటిషన్ వేస్తే ఎలా అని ప్రశ్నించింది. చివరి నిమిషంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. దీంతో తమ పిటిషన్‌ను తల్లిదండ్రుల సంఘం ఉపసంహరించుకుంది.
కాగా.. ప్రస్తుతం ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 25 నుంచి మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. గతంలో.. కరోనాతో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో అందరినీ ద్వితీయ సంవత్సరానికి ప్రమోట్ చేసింది ప్రభుత్వం. ఇప్పుడు మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది.
ఈ నిర్ణయంపై ఆందోళన వ్యక్తమైంది. ఒకసారి ప్రమోట్ అయిన విద్యార్థులకు ఇప్పుడు పరీక్షలు నిర్వహించడం సరికాదని తల్లిదండ్రులు అంటున్నారు. ఇప్పటికే.. వారంతా ద్వితీయ సంవత్సరం చదువుతున్నందున.. మళ్లీ మొదటి సంవత్సరం సబ్జెక్టులు చదవడం గందరగోళానికి, ఒత్తిడికి దారిస్తుందని, మిగతా వారిలాగే వీరినీ పాస్ అయినట్టు ప్రకటించాలని కోరుతూ.. తల్లిదండ్రుల సంఘం నిన్న కోర్టును ఆశ్రయించింది. అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యర్థించడంతో ఈ మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో హైకోర్టు విచారణ జరిపింది.
అయితే.. ఇప్పటికే ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్టు ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. విద్యార్థులను ద్వితీయ సంవత్సరానికి ప్రమోట్ చేసిన సందర్భంలోనే పరిస్థితిని బట్టి మళ్లీ పరీక్ష ఉంటుందని చెప్పామన్నారు. గతంలో.. ఈ విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయలేదు. ఇప్పుడు ఈ పరీక్షలు కూడా రాయకపోతే.. భవిష్యత్తులో ఏదైనా పరిస్థితులు ఎదురై ద్వితీయ సంవత్సరం పరీక్షలు కూడా రాయకుంటే వారిని ఎలా ఎవాల్యుయేట్ చేయాలన్న అంశాన్ని ప్రధానంగా లేవనెత్తారు.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసులో వాదోపవాదాలను సంగతి పక్కనబెట్టి.. అసలు చివరి నిమిషంలో పిటిషన్ వేస్తే ఎలా విచారణ జరపుతామంటూ అభ్యంతరం వ్యక్తంచేసింది. పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని పిటిషనర్‌కు సూచించగా.. తల్లిదండ్రుల సంఘం పిటిషన్ ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది.
ఇదీ చూడండి:
HC ON GO 55: డిగ్రీ కళాశాలల్లో సీట్ల కేటాయింపుపై స్టే పొడిగింపు