ఏపీ బిల్డ్ మిషన్ (AP Mission Build) పేరుతో ప్రభుత్వ స్థలాలను విక్రయించటంపై హైకోర్టులో (high court) దాఖలైన పిటిషన్పై ఇవాళ విచారణ జరిగింది. అభివృద్ధి పేరుతో ప్రభుత్వ భూములను విక్రయించటం సరికాదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇప్పటికే ఈ అంశంపై పలువురు పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో..అన్ని పిటిషన్లను కలిపి జులై 15న విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది.
ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ధర్మాసనం జులై 15కు వాయిదా వేసింది. ఏపి బిల్డ్ మిషన్ పేరుతో జరుపనున్న స్థల విక్రయాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను గతంలోనే జారీ చేసింది.
ఇవీ చదవండి
'ప్రభుత్వం అసత్యాలు, తప్పుడు ఆరోపణలతో అఫిడవిట్ దాఖలు చేసింది'