High Court: వివేకానంద హత్య కేసులో దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, మరో నిందితుడు సునీల్‌యాదవ్ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి వ్యాజ్యంలో తనను ప్రతివాదిగా చేర్చుకుని వాదనలు వినాలని వివేకా కుమార్తె సునీత కోరింది. నిందితుల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. సీబీఐ, సునీత తరఫు న్యాయవాదుల వాదనల కోసం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: సజ్జల డైరెక్షన్లో.. "అనంత" పోలీసులు పనిచేస్తున్నారు: జేసీ