ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు మున్సిపల్ ఎన్నికలను నిర్వహించే అధికారం లేదని పేర్కొంటూ.. దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. పిటిషనర్ తరపు న్యాయవాది పీపీ కృష్ణయ్య, రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది అశ్వనీకుమార్, ప్రభుత్వం తరఫున అడ్వాకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. పిల్‌ను కొట్టేసింది. మున్సిపల్ ఎన్నికలు చివరి దశలో పిటిషనర్ కోర్టును ఆశ్రయించారని ఆక్షేపించింది.
గతంలో.. పదవీ కాలం పూర్తి కాకుండా ఎన్నిలక కమిషనర్ తొలగింపును ఉద్దేశించి ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ.. ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్, మరికొందరు గతంలో హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
ఆ ఆర్డినెన్స్ రద్దు చేస్తూ.. ఎస్ఈసీగా రమేశ్ కుమార్‌ను పునరుద్ధరించాలని ధర్మాసనం ఆదేశించింది. అయితే ఎన్నికల కమిషనర్.. పంచాయతీరాజ్ చట్టంలో సెక్షన్- 200 ప్రకారం నియమితులైనందున మున్సివల్ ఎన్నికలను నిర్వహించే అధికారం నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు లేదని దర్మాసనం తీర్పు ఇచ్చింది.
ఈ నేపథ్యంలో ప్రస్తుత కమిషనర్ నిమ్మగడ్డ.. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించకూడదని పేర్కొంటూ.. న్యాయవాది పొన్న కంటే మల్లిఖార్జునరావు హైకోర్టులో దాఖలు చేసిన పిల్‌పై కోర్టు విచారణ జరిపింది.
ఇదీ చూడండి:
ఏపీమెడ్‌టెక్ జోన్‌తో కలిసి పనిచేసేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆసక్తి