High court: సర్వీసు రికార్డులో వివరాలు తారుమారు చేశారన్న ఆరోపణతో.. సీఐడీ నమోదు చేసిన కేసులో బెయిలు మంజూరు చేయాలంటూ తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణను మూసివేసింది. రిమాండ్ కోసం హాజరుపర్చినప్పుడు అశోక్ బాబుకు.. దిగువ కోర్టు బెయిలు మంజూరు చేసిందని పిటిషనర్ తరపు న్యాయవాది.. పోసాని వెంకటేశ్వర్లు, సీఐడి తరపు న్యాయవాది చైతన్య కోర్టు దృష్టికి తెచ్చారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిన్ డి. రమేశ్.. బెయిల్ పిటిషన్పై విచారణను మూసివేస్తూ ఉత్తర్వులిచ్చారు.
ఇదీ చదవండి: