నైట్రోజన్, ఫాస్పెట్, పోటాషియం గ్రాన్యులేటెడ్ మిక్చర్ ఫెర్టిలైజర్ గ్రేడ్ల విషయంలో డీ నోటిపై చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టులో జీవో 67ను జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని కొట్టివేస్తూ జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు తీర్పు ఇచ్చారు. గ్రేడ్ల విషయంలో అనుమతులను డీ నోటిఫై చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.
జీవో 67ను సవాలు చేస్తూ.. మిశ్రమ ఎరువుల తయారీకి చెందిన రెండు యూనిట్లు హైకోర్టు ఆశ్రయించాయి. డీ నోటిపై అధికారం కేంద్రానికే ఉంటుందని వ్యాజ్యాంలో పేర్కొన్నాయి. ప్రభుత్వం తరవు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదిస్తూ .. మిశ్రమ ఎరువులను పరీక్షించగా పోషకాలు లేవని.. డీ నోటిపై చేసే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెల్లడించింది.
ఇదీచూడండి: