Rush in Alipiri: తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. భక్తులు సొంత వాహనాలల్లో రావడంతో తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాల రద్దీ పెరిగింది. అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి గోమందిరం వరకు వాహనాలు బారులు తీరాయి. వారాంతం ముగిసినా భక్తులు అధికసంఖ్యలో శ్రీవారి దర్శనానికి తరలివస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమైనా.. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ పెరుగుతుంది.
రికార్డు ఆదాయం: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం సమకూరింది. తాజాగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.6.18 కోట్లు వచ్చింది. ఫలితంగా తితిదే చరిత్రలో రెండోసారి ఒకరోజు శ్రీనివాసుడి హుండీ ఆదాయం రూ. 6 కోట్లు దాటింది. 2018 జులై 26న శ్రీవారి హుండీ ఆదాయం రూ.6.28 కోట్లు రాగా.. తాజాగా మళ్లీ రూ.6.18 కోట్ల ఆదాయం వచ్చింది.
ఇదీ చదవండి: