ఇవీ చదవండి :
Rains in Telangana: జలదిగ్బంధంలో హైదరాబాద్ పాతబస్తీ.. బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు - నగరంలో భారీ వర్షం
Rains in telangana: ఇవాళ ఉదయం కురిసిన కుండపోత వర్షానికి.. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో ఉన్న పాతబస్తీలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు భారీగా వచ్చి చేరింది. భారీ వర్షానికి రోడ్లపై నీరు నిలవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. యాకుత్‌పురా నియోజకవర్గంలోని చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా ధోబీఘాట్ ప్రాంతంలో ఇళ్లు నీట మునగడంతో ఆ ప్రాంతంలోని ప్రజలను బోట్ల ద్వారా సురక్షితంగా బయటకు తీసుకువస్తున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మదీనా నగర్, ధోబీఘాట్, తలాబ్ కట్ట, బహదూర్పురా నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాలు అయిన మక్కా కాలనీ, బిలాల్ నగర్, చంద్రాయణ్గుట్ట నియోజకవర్గంలోని ఉప్పుగూడ, శివ గంగా నగర్, అరుంధతి కాలనీ ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.
జలదిగ్బంధంలో తెలంగాణలోని పాతబస్తీ