ETV Bharat / city

ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక - heavy floods in krishna

కృష్ణానదికి వరద ప్రవాహం భారీగా పెరిగింది. ప్రకాశం బ్యారేజ్ ఔట్ ఫ్లో 6.57 లక్షల క్యూసెక్కులు ఉంది. ప్రకాశం బ్యారేజీలో నీటిమట్టం 15 అడుగులు దాటింది. బ్యారేజీ గేట్ల పైనుంచి వరదనీరు ప్రవహిస్తుంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విపత్తు నిర్వహణ శాఖ కృష్ణా జిల్లా అధికారులను అప్రమత్తం చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది.

కృష్ణానదిలో వరద తీవ్రత
author img

By

Published : Aug 16, 2019, 7:53 AM IST

Updated : Aug 16, 2019, 9:58 AM IST

కృష్ణానదిలో వరద తీవ్రత

కృష్ణా నదిలో భారీగా వరద ప్రవాహం పెరిగింది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి 7 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు వచ్చి చేరుతోంది. ప్రకాశం బ్యారేజీ నీటిమట్టం 15 అడుగులకు చేరడంతో బ్యారేజీ గేట్లపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. గేట్లు మొత్తం ఎత్తి 5.5 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పవిత్ర సంగమం వద్ద పుష్కర్‌నగర్‌లోకి వరద నీరు వచ్చి చేరింది. ప్రవాహం మరింత ఎక్కువైతే ఇబ్రహీంపట్నం ప్రధాన రహదారిపైకి వరద నీరు వచ్చే అవకాశముంది. ముంపువాసులు ఇళ్లను వదిలి రోడ్లపైకి చేరారు. జిల్లాయంత్రాంగాన్ని విపత్తు నిర్వహణశాఖ అప్రమత్తం చేసింది. నదీ పరివాహక ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందిగా సూచించింది.

మరోవైపు గుంటూరు జిల్లా అమరావతి మండలం పెద్దమద్దూరు గ్రామాన్ని కృష్ణా వరద నీరు ముంచెత్తింది. మద్దూరు వంతెనపై వరద నీరు భారీగా చేరింది. అమరేశ్వర ఆలయం నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. కృష్ణా నదిలో వరద ఉద్ధృతి దృష్ట్యా గ్రామాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. మోపిదేవి, కొక్కిలిగడ్డ, కొత్తపాలెం హరిజనవాడ ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. బొబ్బర్లంక గ్రామస్థులను కూడా ఖాళీ చేయించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

చంద్రబాబు నివాసం వైపునకు వరద నీరు...
అమరావతిలో చంద్రబాబు నివాసం వైపునకు వరద నీరు చేరింది. నది వెంబడి ఉన్న అతిథిగృహాలను వరద నీరు తాకుతోంది. చంద్రబాబు నివాసం వద్ద వరద పరిశీలించేందుకు ఎమ్మెల్యే ఆర్కే వచ్చారు. కానీ... చంద్రబాబు భద్రతా సిబ్బంది లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు. ప్రభుత్వ స్థలంలోకి వెళ్లేందుకు అనుమతి అవసరం లేదంటూ... ఎమ్మెల్యే ఆర్కే వెళ్లారు.

సీఎం సమీక్ష...
కృష్ణాలో వరద పరిస్థితిపై సీఎం జగన్‌ సమీక్షించారు. అమెరికా వెళ్లేముందు వరద పరిస్థితిపై సీఎంవో అధికారులతో సమీక్ష చేసిన సీఎం... వివిధ రిజర్వాయర్ల నుంచి విడుదలవుతున్న ప్రవాహం వివరాలు తెలుసుకున్నారు. దాదాపు 7లక్షల క్యూసెక్కులకుపైగా నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుతోందని అధికారులు సీఎంకు తెలిపారు. కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులను అప్రమత్తం చేయాలన్న సీఎం జగన్‌... సహాయచర్యలకు సన్నద్ధం కావాలని ఆదేశించారు.

ఇదీ చదవండీ...

కొత్త అందాలు సంతరించుకున్న సంగమ ప్రదేశం

sample description
Last Updated : Aug 16, 2019, 9:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.