రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరోమారు గరిష్ఠస్థాయికి తీసుకెళ్లాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు సూచించింది. ఇందుకోసం ఆదివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించింది. ఒక్కరోజులో 6 లక్షల డోసులు ఇవ్వగల సామర్థ్యం ఏపీకి ఉందని.. దీన్ని మరింతగా పెంచేందుకు ఆలోచిస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. కరోనా మూడో వేవ్ దృష్ట్యా... ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సహా మౌలిక సదుపాయాల కల్పన కోసం 267 కోట్ల రూపాయల్ని ఖర్చు చేయనున్నట్టు వెల్లడించారు. 12 వేల ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ల కోసం ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. 25 క్రయోజెనిక్ ట్యాంకర్లను కోనుగోలు చేసి రాష్ట్రంలోని మూడుప్రాంతాల్లో ఉంచి లిక్విడ్ ఆక్సిజన్ నిల్వలు చేయాలని నిర్ణయించామన్నారు.
ఇదీచదవండి