రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌కు ఆటంకం కలగకుండా.. 4.40 లక్షల కొవిషీల్డ్ డోసులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. ఈరోజు హైదరాబాద్ నుంచి మరో 2 లక్షల కోవ్యాక్సిన్ టీకాలు రానున్నాయని తెలిపారు. సీఎం లేఖ రాయగానే స్పందించి.. ఏపీకి వ్యాక్సిన్ పంపిన ప్రధాని మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: మహారాష్ట్రలో మరో 51వేల కరోనా కేసులు
గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న 4.40 లక్షల కొవిషీల్డ్ డోసులను తక్షణమే అన్ని జిల్లాలకు పంపాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి ప్రకటించారు. 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ టీకా అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు.. వాలంటీర్లు, ఆశా వర్కర్ల సేవలను వినియోగించుకుంటున్నామని వెల్లడించారు. ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో అర్హులైన వారందరికీ వ్యాక్సిన్ వేస్తామని చెప్పారు. కరోనా వ్యాప్తి కట్టడి కోసం 'టెస్టింగ్, ట్రాకింగ్, ట్రేసింగ్' విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: