PRINCIPAL SECRETARY KRISHNABABU : వైద్యశాఖలో మూడేళ్లలో 45 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. పీహెచ్‌సీల్లో టెలీ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేశామని.. రూ.16,255 కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. ఏజెన్సీలో పనిచేసే వైద్యులకు ఎక్కువ జీతం ఇస్తున్నామని పేర్కొన్నారు. వైద్య, ఆరోగ్యశాఖను బలోపేతం చేసేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మరో రెండేళ్లలో ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు తయారవుతాయని స్పష్టం చేశారు. బయోమెట్రిక్ హాజరు వల్ల వైద్యుల పనితీరు మెరుగుపడిందని కితాబిచ్చారు. ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్యశాఖ సిబ్బందికి ముఖ ఆధారిత హాజరు యాప్ తెచ్చే యోచన లేదని తేల్చిచెప్పారు.
ఇవీ చదవండి: