కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో న్యాయస్థానాల్లో వైరస్ను కట్టడి చేసేందుకు హైకోర్టు పలు నిర్ణయాలు తీసుకున్నట్లు హైకోర్టు రిజిస్ట్రార్ తెలిపారు. హైకోర్టు పరిధిలో ఉండే కిందిస్థాయి న్యాయస్థానాల్లో షిప్టుల వారీగా 50 శాతం సిబ్బంది మాత్రమే విధులకు హాజరుకావాలని తెలిపారు. సంబంధిత కోర్టు న్యాయాధికారి చెప్పిన విధంగా సిబ్బంది విధుల్లోకి హాజరు కావాలని సూచించారు.
విధుల్లోకి రాని సిబ్బంది సైతం సంబంధిత కోర్టు అధికారులకు ఫోన్లో అందుబాటులో ఉండాలని తెలిపారు. న్యాయాధికారికి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎవ్వరూ దూర ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించారు. కోర్టు విధులకు హాజరైనప్పుడు కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి, భౌతికదూరం పాటించాలని సిబ్బందికి సూచించారు.
ఇదీచదవండి