ETV Bharat / city

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ

author img

By

Published : Mar 19, 2021, 7:07 AM IST

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని ఎస్ఈసీని ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 20 కి వాయిదా వేసింది.

hc
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించేలా ఆదేశించాలంటూ దాఖలైన వ్యాజ్యంలో వివరాలు సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ఎక్కడ నిలిచిపోయాయో అక్కడినుంచి ప్రారంభించేలా ఎస్‌ఈసీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ గుంటూరు జిల్లాకు చెందిన రామిరెడ్డి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్, ఎస్ఈసీ కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశాంత్ వాదనలు వినిపిస్తూ... ఎన్నికల కమిషనర్ ఈనెల 31 తో పదవీ విరమణ చేయనున్నారన్నారు. గతంలో నిలిచిపోయిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పూర్తి చేయడానికి పది రోజులు సరిపోతాయన్నారు.

ఎన్నికలు నిర్వహించకుండా కమిషనర్ కొద్దిరోజులు వ్యక్తిగత సెలవుపై వెళుతున్నారన్నారు. ఓ సారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాక పూర్తి చేయాల్సిన బాధ్యత ఎస్‌ఈసీపై ఉందన్నారు. ప్రభుత్వం తరపు ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం సైతం ఎన్నికల్ని పూర్తి చేయాలని కోరుతోందన్నారు. ఆ ప్రక్రియ పూర్తి అయితే కరోనా కట్టడిపై దృష్టి సారించేందుకు, పూర్తి స్థాయిలో టీకా కార్యక్రమం చేపట్టేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. కరోనా రెండో వ్యాప్తి ప్రమాదం పొంచి ఉందన్నారు. ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు, సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాయని గుర్తుచేశారు. ఎస్ఈసీ తరపు న్యాయవాది అశ్వనీకుమార్ స్పందిస్తూ.. ఈ వ్యవహారం పై వివరాలు సమర్పించేందుకు విచారణను ఈనెల 20 కి వాయిదా వేయాలని కోరారు. అందుకు న్యాయమూర్తి అంగీకరించి విచారణను ఈ నెల 20 కి వాయిదా వేశారు.

ఇదీ చదవండి: 2022 మార్చి నాటికి గుండ్లకమ్మ ప్రాజెక్టును పూర్తి చేస్తాం : కేంద్రం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.